జిల్లాలో 82.08 శాతం పోలింగ్ నమోదు
GDWL: జిల్లాలోని నాలుగు మండలాల్లో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 82.08 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మండలాల వారీగా చూస్తే వడ్డేపల్లి మండలంలో అత్యధికంగా 86.16 శాతం, అయిజలో 82.70 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియగా, మరికొద్ది సేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.