ప్రత్యేక పుష్పాలంకరణలో దర్శనమిచ్చిన పెళ్లిళ్ల వెంకన్న

ప్రత్యేక పుష్పాలంకరణలో దర్శనమిచ్చిన పెళ్లిళ్ల వెంకన్న

కోనసీమ: అమలాపురం పట్టణంలో పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పుష్పయాగం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేక పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజామునుంచే అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణమంతా భక్తి గీతాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.