'మానవ సంబంధాలను దెబ్బతీసే మత్తు జోలికి వెళ్లొద్దు'
CTR: మానవత్వాన్ని, మానవ సంబంధాలను దెబ్బతీసే మత్తు పదార్థాల జోలికి యువత వెళ్లవద్దని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. అపోలో నాలెడ్జి సిటీలో బుధవారం సాయంత్రం జరిగిన "మాదకద్రవ్యాల దుర్వినియోగం నిశ్శబ్ద సంక్షోభం" అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.