ప్రమాద ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండల పరిధిలో రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందడం బాధాకరమని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు, వైద్యులకు మంత్రి ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.