ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే కొండబాబు
KKD: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎంతగానో దోహదపడుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శనివారం కాకినాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొండబాబు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారుల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.