బాలికపై అర్చకుడు లైంగిక దాడి.. ఆలస్యంగా వెలుగులోకి

బాలికపై అర్చకుడు లైంగిక దాడి.. ఆలస్యంగా వెలుగులోకి

కృష్ణా: మచిలీపట్నంలో ఓ కీచక అర్చకుడి కిరాతకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటర్ చదువుతున్న బాలికను గత డిసెంబర్ నుంచి రఘునాథశర్మ అనే అర్చకుడు లైంగికంగా వేధించి, దాడి చేస్తున్నాడు. కొన్ని రోజులుగా బాలిక ఆనారోగ్యంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. గర్భం దాల్చింది. బాలిక పేరెంట్స్ ఫిర్యాదుతో అర్చుకుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.