రాహుల్, మమత అర్బన్ నక్సల్స్: కేంద్రమంత్రి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక అర్బన్ నక్సల్ అని కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ ఆరోపించారు. చివరి మొగల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌తో ఆయన్ని పోల్చారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా అర్బన్ నక్సలేనని అన్నారు. ఎలాంటి దార్శనికత లేని రాహుల్ వంటి నేతను ఇంతవరకు తాను చూడలేదని వ్యాఖ్యానించారు.