VIDEO: మైనర్ బాలికను బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం
WGL: వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఇద్దరు మైనర్లు మద్యం మత్తులో ఓ మైనర్ బాలికను బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గమనించిన స్థానికులు అడ్డుకోవడంతో గొడవ చోటుచేసుకుంది. అనంతరం కారులో బాలికతో పరారయ్యేందుకు యత్నించగా స్థానికులు కారును అడ్డగించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మైనర్లను మందలించి వదిలేసినట్లు సమాచారం.