గ్రామాల్లో పోలింగ్ చీటీలు పంపిణీ చేసిన బీఎల్వోలు
SRD: సిర్గాపూర్ మండలం పరిధిలోని 21 గ్రామపంచాయతీలో సోమవారం బూత్ లేవల్ ఆఫీసర్లు (BLO) పోలింగ్ చీటీలు పంపిణీ చేశారు. మండలంలో మొత్తం 24,990 ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 12,595, మహిళలు 12,394, ఇతరులు ఒకరు ఉన్నారు. అయితే మండలంలో 180 వార్డుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు BLOలు వార్డు వారిగా ఓటర్లకు పోలింగ్ చీటీలు అందజేశారు.