వర్షాలు కురవాలని శివునికి అభిషేకం

SKLM: టెక్కలి మండలం బూరగాం గ్రామంలో శనివారం గ్రామ ప్రజలు వరుణ దేవుడు కోసం 108 బిందెలతో శివునికి అభిషేకం నిర్వహించారు. ప్రజలంతా గ్రామంలోని శివాలయం వద్ద భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలోని మంచినీటి చెరువు నుంచి మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు అంతా కలిసి 108 బిందెలతో శివలింగంపై నీళ్లు పోసి వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని ప్రార్ధించారు.