తేనెటీగల దాడిలో 20 మందికి గాయాలు
KDP: రాజంపేట మండలం కూచివారిపల్లిలో గ్రామస్థులపై తేనెటీగల దాడి జరిగి సుమారు 20 మంది గాయపడ్డారు. ఆరు బయట కూర్చొని ఉన్న వారిపై ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో తేనెటీగలు దాడి చేయడంతో భయంతో గ్రామస్థులు పరుగులు తీశారు. గాయపడిన వారిలో కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రిలో, మరికొంతమంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.