సేంద్రియ వ్యవసాయంపై రైతుల దృష్టి సారించాలి: మంత్రి
PPM: రసాయనిక ఎరువులు వినియోగం తగ్గించి సేంద్రీయ ఎరువులు వినియోగించాలని గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఆదివారం పాచిపెంట మండలం పి. కోనవలస గ్రామానికి 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయితీపై అందిస్తున్న వ్యవసాయ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.