'మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయాలి'
SRCL: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షంతో తడిసి మొలకెత్తిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు ఆర్డీవో రాధాబాయి సూచించారు. చందుర్తి మండల కేంద్రంతో పాటు రామన్నపేట తిమ్మాపూర్ ఆసిరెడ్డిపల్లి నర్సింగాపూర్ మూడపల్లి గ్రామాల్లోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను గురువారం ఆమె సందర్శించారు.