ఇరు దేశాలు సంయమనం పాటించాలి: ఐరాస

ఇరు దేశాలు సంయమనం పాటించాలి: ఐరాస

భారత్-పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన చేసింది. ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడం బాధాకరమని, ఇరు దేశాలు సంయమనం పాటించాలని పేర్కొంది. J&K పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భావోద్వేగాలను అర్థం చేసుకోగలం కానీ, సైనిక చర్యలు పరిష్కారం కాదని ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరెస్ పేర్కొన్నారు. ఉద్రిక్తతలు నివారించే ఏ చర్యకైనా సహకరిస్తామన్నారు.