జామి మండలంలో ఘనంగా భోగి వేడుకలు

VZM: భోగి సందర్భంగా విజయనగరం జిల్లాలోని అన్నీ గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. యువత భోగి మంటలు వేయగా పిల్లలు మంటల్లో పిడకలు వేసి ఆనందంగా గడిపారు. పలు చోట్ల మహిళలు భోగి మంటల చుట్టూ డాన్స్ వేస్తూ సందడి చేశారు. కొత్త అల్లుడు, కోడలు, బంధువులు, వలస వెళ్లి పండగ కోసం స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వారితో గ్రామాలు కళకళలాడుతున్నాయి.