అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం
KDP: అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా వేంపల్లె పట్టణంలో గురువారం అగ్నిమాపక శాఖ అధికారి శివరామిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు గ్యాస్, విద్యుత్ అగ్ని ప్రమాదాల నిరోధక చర్యల గురించి తెలియజేశారు. అలాగే సిబ్బంది అగ్ని ప్రమాద నివారణ విన్యాసాలు చేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.