VIDEO: వెంకటాయపల్లి వద్ద ప్రమాదకరంగా మూలమలుపు
MDK: తూప్రాన్ మండలం వెంకటాయపల్లి నుంచి నర్సంపల్లి వెళ్లే మార్గంలో మూలమలుపు ప్రమాదకరంగా ఉంది. రైల్వే లైన్ కారణంగా రోడ్డును వంకరగా బ్రిడ్జి మీదుగా నిర్మాణం చేశారు. రోడ్డు మూలమలుపు భారీగా ఉన్నప్పటికీ ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఆ రోడ్డున వెళ్లే కొత్త వ్యక్తుల వాహనాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.