రికార్డు స్థాయికి వన్యప్రాణుల అక్రమ రవాణా
2025లో ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల అక్రమ రవాణా రికార్డు స్థాయికి చేరిందని ఇంటర్‌పోల్ తెలిపింది. నెల రోజులపాటు జరిగిన తనిఖీల్లో అధికారులు 30,000 జంతువులను పట్టుకున్నారు. ఈ దందా సుమారు $20 బిలియన్ల విలువ కలిగి ఉంటుందని, నిందితులు పాంగోలిన్లు, తాబేళ్లు తదితర జీవాల శరీర భాగాలనూ తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో సుమారు 1100 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.