భర్తను వరించిన ఉపసర్పంచ్ పదవి
SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో భార్యాభర్తలు వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలోని 10,11వ వార్డులు జనరల్ స్థానాలుగా కేటాయించగా బత్తుల మానస 10వ వార్డు, బత్తుల క్రాంతి 11వ వార్డు నుండి దంపతులు పోటీ చేసి ఇద్దరూ గెలుపొందారు. వార్డుసభ్యులు క్రాంతిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు.