ప్లాస్టిక్ నిషేధంపై పంచాయతీలో ప్రచారం
VZM: చీపురుపల్లి పంచాయతీలో వ్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ఆదివారం ప్రచారం నిర్వహించారు. పంచాయతీ సెక్రటరీ ఆదేశాలతో జూనియర్ అసిస్టెంట్ ఎన్.రామ్మోహన్‌రావు ఈ కార్యక్రమం చేపట్టారు. పశువులు ప్లాస్టిక్ వస్తువులను తిని గర్భకోశ వ్యాధులకు గురై మృత్యువాత పడుతున్నాయని, 55 మైక్రోల కన్నా తక్కువ గల ప్లాస్టిక్‌ను అమ్మినా, వాడిన చర్యలు తీసుకుంటామన్నారు.