ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ హాజరయ్యారు. ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఎమ్మెల్యే ప్రత్యక్షంగా స్వీకరించారు. వెంటనే స్పందించిన నసీర్, సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.