ధ్రువ్ జురెల్‌పై గంగూలీ ప్రశంసలు
యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్‌పై సౌరభ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం జురెల్ టెస్టుల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని చెప్పాడు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో జురెల్‌కు చోటు కల్పించాలని అభిప్రాయపడ్డాడు. సాయి సుదర్శన్ స్థానంలో జురెల్‌ను నెం.3లో ఆడిస్తే బాగుంటుందని చెప్పాడు. అయితే, జట్టు యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలని పేర్కొన్నాడు.