'పోలింగ్ నిర్వహణలో ప్రోసైడింగ్ అధికారుల పాత్ర కీలకం'
KMM: పోలింగ్ నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర చాలా కీలకమైనదని ఎంపీడీవో పి. శ్రీనివాసరావు అన్నారు. కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమావేశ మందిరంలో బుధవారం జరిగిన ప్రిసైడింగ్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ రోజు పీవో, ఏపీవోలు చేపట్టాల్సిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.