వృద్ధుడిని ఢీ కొట్టిన లారీ.. అక్కడిక్కడే మృతి

వృద్ధుడిని ఢీ కొట్టిన లారీ.. అక్కడిక్కడే మృతి

కోనసీమ: పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి ఒక లారీ రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు లారీ వెనక టైరు కింద వృద్ధుడు విళ్ళ నాగు(60) పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అతను సైకిల్‌పై వస్తుండగా లారీని గమనించక దాని కింద పడిపోయాడని స్థానికులు చెప్తున్నారు. లారీతో సహా డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.