ప్రభుత్వ పాఠశాలకు డెస్కులు పంపిణీ

MDK: రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ హైదరాబాద్ వ్యవస్థాపకులు కెవిఎస్ సాయికుమార్ 42 డెస్క్‌లను పంపిణీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్యాంసుందర చారి, రాజ్ కుమార్, గోపాల్, సుదర్శన్, రమేష్, దేవేందర్ పాల్గొన్నారు.