దళిత రైతు భూమిని కాపాడాలని మాల మహానాడు డిమాండ్

దళిత రైతు భూమిని కాపాడాలని మాల మహానాడు డిమాండ్

CTR: చౌడేపల్లి మండలం అప్పినేపల్లికి చెందిన దళిత రైతు చిన్న రెడ్డప్ప భూమిని ఆక్రమణ నుంచి రక్షించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు యమల సుదర్శనం సోమవారం డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారుల విఫలతపై నిరసన తెలిపిన ఆయన, రెడ్డప్పకు 1980లో మంజూరైన భూమిని భూస్వాములు అక్రమంగా ఆక్రమించారని ఆరోపించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.