కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకై ప్రతిపాదిత స్థలం పరిశీలన
ASF: కాగజ్ నగర్ పట్టణంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు పెంచి నాణ్యమైన విద్య అందిస్తామని ఆమె చెప్పారు. అనంతరం పట్టణంలోని ఈఎస్సై ఆసుపత్రి స్థలాన్ని కూడా పరిశీలించి, సిబ్బంది గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.