చెరువులో దూకిన మహిళను కాపాడిన పోలీసులు

చెరువులో దూకిన మహిళను కాపాడిన పోలీసులు

NZB: ఆర్మూర్ శివారులోని పెర్కిట్ చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను పోలీసులు రక్షించారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పెర్కిట్‌కు చెందిన ఓ మహిళ(50) కుటుంబ కలహాల కారణంగా మనస్తాపం చెంది చెరువులో దూకింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా బయటికి కాపాడారు.