16వ తేదీ వరకు భారీ వర్షాలు

ప్రకాశం: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఈనెల 16వ తేదీ వరకు భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, టంగుటూరు, సింగరాయకొండ మండలాల్లో ముందస్తు సహాయక చర్యలు ప్రారంభించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా జిల్లా, మండలస్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి తక్షణ చర్యలకు దిశానిర్దేశం చేశారు.