సీఎం చంద్రబాబుపై జగన్ హాట్ కామెంట్స్
GNTR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న దరిద్రపు పని అని మాజీ సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. స్కాములు చేస్తూ మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నాడని తెలిపారు. మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. పత్రి జిల్లాకో గవర్నమెంట్ కాలేజీ తీసుకొచ్చాం. వాటికోసం ఏడాదికి రూ. 1000 కోట్లు ఖర్చు చేసినా సరిపోయేదని ఆయన పేర్కొన్నారు.