తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో మృతదేహం లభ్యం

GNTR: తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని సౌత్ క్యాబిన్ వద్ద మృతదేహం పట్టాలపై పడి ఉండటాన్ని శుక్రవారం రైల్వే సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న GRP SI వెంకటాద్రి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో భాగంగా మృతుడి వయస్సు 55-60 మధ్య ఉంటుందని, ట్రాక్ దాటుతుండగా గుండెపోటుతో మరణించి ఉండవచ్చని భావిస్తున్నట్లు SI తెలిపారు.