రాష్ట్రంలోనే మొదటి సారి.. సైబర్ నేరాల కేసులో పీడీ యాక్ట్

రాష్ట్రంలోనే మొదటి సారి.. సైబర్ నేరాల కేసులో పీడీ యాక్ట్

NZB: రాష్ట్రంలో మొట్ట మొదటి సారి సైబర్ నేరాల కేసులో ఓ వ్యక్తిపై నిజామాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించి వారితో సైబర్ నేరాలు చేయిస్తున్న నాగశివపై PD యాక్ట్ నమోదు చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. యువత ఇటువంటి వారిని నమ్మి మోసపోవద్దని సూచించారు.