పాఠశాల బాత్రూమ్‌లో నల్లాలు ఎత్తుకెళ్లిన దుండగులు
VKB: ధారూర్(మం) గడ్డమీది గంగారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో గుర్తు తెలియని దుండగులు బాత్రూం తాళాలు విరగ్గొట్టి లోపల ఉన్న నల్లాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో పాఠశాలలో నీటి సమస్య తలెత్తి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆస్తులను దొంగిలించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే కొత్త నల్లాలు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.