జామి పరిసరాల ప్రాంతాల్లో దాడులు

VZM: జామి పోలీసు స్టేషన్ పరిధిలోని అలమండ సంత పరిసరాల్లో బహిరంగ మద్యం సేవిస్తున్న వారిపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. డ్రోన్ సహాయంతో దాడులు నిర్వహించగా తొమ్మిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై డ్రోన్ సహాయంతో ఆకస్మిక దాడులు చేపడుతున్నట్లు చెప్పారు.