ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇవ్వండి: విజయానంద రెడ్డి

ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇవ్వండి: విజయానంద రెడ్డి

చిత్తూరు: నగర పరిధిలోని 3వ వార్డు దొడ్డిపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద రెడ్డి ఎన్నికల ప్రచారంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రతి గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. రాబోయే ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు.