IDPL భూములపై విచారణకు ఆదేశం
TG: రాష్ట్ర ప్రభుత్వం ఐడీపీఎల్ భూములపై విచారణకు ఆదేశించింది. కూకట్‌పల్లిలోని సర్వే నెంబర్ 376లో రూ.4 వేల కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. భూకబ్జాలపై ఇటీవల ఎమ్మెల్యే మాధవరం, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.