ALERT: పిడుగులతో కూడిన వర్షాలు
AP: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. మరికొన్ని జిల్లాల్లో ఎండల ప్రభావం కొనసాగనుంది. ఆవర్తనాల ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, దక్షిణాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.