ఘనంగా కొనసాగుతున్న శ్రీ రాపూరమ్మ తల్లి జాతర..

NLR: రాపూరు పట్టణంలోని శ్రీ రాపూరమ్మ తల్లి జాతర ఘనంగా కొనసాగుతుంది. ఇవాళ అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు పూజలు ఘనంగా జరిగాయి. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి, పొంగళ్ళు పొంగించి అమ్మవారికి తమ నైవేద్యాలు సమర్పిస్తున్నారు. అనంతరం తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.