కొమ్మాది నవోదయను సందర్శించిన జిల్లా కలెక్టర్
విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ గురువారం కొమ్మాది జవహర్ నవోదయ విద్యాలయాన్ని సందర్శించారు. మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. విద్యాలయ పనితీరు, ఫలితాలపై సమీక్ష నిర్వహించి, విద్యార్థులతో ముచ్చటించారు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. డిజిటల్ స్మార్ట్ బోర్డులను పరిశీలించారు.