మంథనిలో ప్రధాన రహదారిపై క్షుద్రపూజలు

మంథనిలో ప్రధాన రహదారిపై క్షుద్రపూజలు

PDPL: అమావాస్య రోజు క్షుద్రపూజలు చేసిన ఘటన మంథనిలో చోటుచేసుకుంది. మంథని నుంచి పెద్దపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై గురువారం క్షుద్రపూజలు చేశారు. కార్తీక మాసం చివరి అమావాస్య కావడంతో గుమ్మడి కాయలు, నిమ్మకాయలు, కుంకుమ, భారీగా క్షుద్ర పూజల సామాగ్రి దర్శనమిచ్చాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. స్థానికులే ఈ పని చేసుంటారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.