జంగిల్ క్లియరెన్స్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

జంగిల్ క్లియరెన్స్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

VZM: భోగాపురం -ముక్కాం ఆర్&బీ రహదారి వద్ద జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్ పనులను ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు రాకపోకల్లో ఇబ్బందులు పడకుండా రహదారిని పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచాలన్నారు.