శబరిమలకు పోటెత్తిన భక్తులు
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిన్నటి నుంచి దర్శనాలు ప్రారంభం కావడంతో వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో కిలోమీటర్ల వరకు క్యూ ఉండటంతో దర్శనానికి 11 గంటల సమయం పడుతోంది. సరైన సౌకర్యాలు లేక భక్తులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.