సమాచార శాఖలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
VSP: ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు శనివారం స్థానిక సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ‘జలం–జీవం’ థీమ్‌తో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్యాలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. ఇప్పటికే ఉన్న ఇంకుడు గుంతలను శుభ్రపరిచి వినియోగంలోకి తీసుకొచ్చారు.