రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
SKLM: కోటబొమ్మాళి మండలం పాకివలస వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కురుడు పంచాయతీ పొన్నానపేటకు చెందిన ముద్దాడ మురళి(34)చీపుర్లపాడు మార్కెట్లో కూరగాయలు విక్రయించేందుకు ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.