ప్రొద్దుటూరులో ప్రైవేట్ ఆస్పత్రుల వివరాల సేకరణ

ప్రొద్దుటూరులో ప్రైవేట్ ఆస్పత్రుల వివరాల సేకరణ

KDP: ప్రొద్దుటూరులోని CNR ఆస్పత్రి రిజిస్ట్రేషన్ రెన్యువల్ లేకుండానే నిర్వహించడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం తదితర ప్రైవేట్ ఆస్పత్రుల వివరాలతో పాటు మెడికల్ స్కానింగ్, ఎక్స్ రే, ల్యాబ్‌ల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. తమ పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రి వివరాలను సేకరించాలని ANMలకు అధికారులు ఆదేశించారు.