VIDEO: ఎట్టకేలకు పలాసకు సాగునీరు.. ఫలించిన ఎమ్మెల్యే కృషి

SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కృషి ఫలించిందని నియోజకవర్గ రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో సాగునీరు అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా కల్పించారని వివరించారు. ఆమె చేసిన కృషితో సోమవారం బాలిగాం తదితర వ్యవసాయ భూములకు సాగునీరు పుష్కలంగా అందుతుందని పేర్కొన్నారు.