యూపీఎస్సీ ఉచిత శిక్షణ దరఖాస్తులు గడువు పెంపు
అనకాపల్లి జిల్లాలో యూపీఎస్సీ సివిల్స్‌కు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల చివరి తేదీని డిసెంబర్ 3 వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కే. శ్రీదేవి తెలిపారు. దరఖాస్తుతో పాటు రెండు ఫోటోలు, విద్యార్హత వివరాలు, కుల, ఆదాయ సర్టిఫికెట్లు, ఆధార్, పాన్ కార్డు ప్రతులు తప్పనిసరిగా జత చేయాలన్నారు.