ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన జిల్లా రెవెన్యూ అధికారి
E.G: జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి శనివారం రాజమండ్రిలో ఈవీఎంల గోడౌన్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు చేపట్టే సాధారణ తనిఖీల్లో భాగంగా ఉదయం స్ట్రాంగ్ రూమ్ గోడౌన్‌ను సందర్శించినట్లు చెప్పారు. వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేసి, సంబంధిత రిజిస్టర్లలో సంతకాలు చేసినట్లు పేర్కొన్నారు.