IPL 2026: ఇషాన్ కిషన్‌కు తొలి సవాల్

IPL 2026: ఇషాన్ కిషన్‌కు తొలి సవాల్

IPL 2026లో భాగంగా కాసేపట్లో RCB, SRH మధ్య తొలి పోరు జరగనుంది. నూతన సారథి ఇషాన్ కిషన్ నాయకత్వంలో SRH బరిలోకి దిగుతోంది. అయితే, భారీ బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్‌రైజర్స్.. బౌలింగ్‌లో బలహీనంగా ఉంది. SRH కనీసం 230+ స్కోర్లు చేస్తేనే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఓ మాదిరి స్కోరు చేస్తే దానిని కాపాడుకునేంత బౌలింగ్ యూనిట్ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.