బాల్యమిత్రుడి కుటుంబానికి చేయూతగా ఆర్థిక సహాయం

KNR: శంకరపట్నం మండలం తాడికల్ పూదారి శ్రీనివాస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పూదారి శ్రీనివాస్ మిత్రబృందం బుధవారం చేయూతగా రూ. 35 వేల ఆర్థిక సహాయం అందించారు. మిత్రబృందం మాట్లాడుతూ.. పూదారి శ్రీనివాస్ చదువుతోపాటు ఆటల్లో చురుగ్గా ఉండేవారని తెలిపారు. ఆయన లేని లోటు మరవలేనిదని మిత్ర బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు, శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు.